Header Banner

పదో తరగతి అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..! ఎంపిక ఎలా ఉంటుందంటే?

  Sat May 10, 2025 18:26        Education

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రైల్వే శాఖ గత నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ డిగ్రీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను మే 11, 2025వ తేదీలోపు సమర్పించాల్సి ఉంది. అయితే తాజాగా దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది. దీంతో మే 19, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఈ నోటిఫికేషన్‌ కింద అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.. రిజియన్లలో నియామకాలు చేపట్టనున్నారు. పదో తరగతితో పాటు ఐటీఐ పూర్తి చేసిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి జులై 01, 2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు..ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250.. జనరల్‌ అభ్యర్ధులకు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.రాత, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ.19,900తోపాటు ఇతర అలవెన్స్‌లు కూడా ఉంటాయి.

ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • అహ్మదాబాద్ రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 497
  • అజ్‌మేర్ రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 820
  • ప్రయాగ్‌రాజ్‌ రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 588
  • భోపాల్‌ రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 664
  • భువనేశ్వర్ రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 928
  • బిలాస్‌పూర్ రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 568
  • చండీఘడ్‌ రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 433
  • చెన్నై రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 362
  • గువాహటి రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 30
  • జమ్ము అండ్‌ శ్రీనగర్ రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 08
  • కోల్‌కతా రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 720
  • మాల్దా రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 432
  • ముంబయి రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 740
  • ముజఫర్‌పూర్ రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 89
  • పట్నా రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 33
  • ప్రయాగ్‌రాజ్ రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 286
  • రాంచీ రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 1213
  • సికింద్రాబాద్ రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 1500
  • సిలిగురి రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 95
  • తిరువనంతపురం రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 148
  • గోరఖ్‌పూర్ రీజియన్‌లో పోస్టుల సంఖ్య: 100


ఇది కూడా చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! కొత్త రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఇవే రూల్స్...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RailwayJobs #10thPassJobs #GovtJobs #IndianRailways #JobAlert #EmploymentNews #SarkariNaukri